ఎవరు ఉన్నారు నాకు ఈలోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా (2)
1. అందరు ఉన్నారనీ అందరు నావారనీ
తలచితినీ భ్రమసితినీ - చివరికి ఒంటరి నేనైతిని (2)
నా గానము నీవయ్యా - నా ధ్యానము నీవయ్యా
నా ప్రాణము నీవయ్యా - నా సర్వము నీవయ్యా ॥యేసయ్యా॥
2. అంధకారములో అంధుడనేనైతిని (2)
నిను చూచే నేత్రములూ - నా కొసగుమా నజరేయుడా (2)
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా - నా శ్వాస నీవయ్యా ॥యేసయ్యా॥
0 Comments