ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా (2)
వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా
అ: సిద్ధపడుమా.... ఓ.... సంఘమా -
క్రీస్తు వచ్చువేళాయే - వేచియుండుమా
యేసువచ్చు వేళాయే - లేచియుండుమా
1. ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపించుమా - నీ ముఖము చూపించుమా (2)
యేసు రాజు - దిగువచ్చువేళ
నీవు సంసిద్ధమా- నీవు పరిశుద్ధమా ॥సిద్ధll
2. కొండపేటులందున - బండ బీటులందున
నీగూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా (2)
లోక ఆశలు - నీకేలనమ్మ
సిద్ధె వెలిగించుమా సిద్ధముగ నుండుమా ॥సిద్ధll
0 Comments