మహిమలో నేనాయనతో నుంటే చాలు (2)
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తులగుంపులో హర్షించిన చాలు (2)
1. యేసుని రక్తమందు కడుగబడి -
వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులలో పేదన్ నేను -
బంగారు వీధులలో తిరిగెదను (2)
2. దూతలు వీణలను మీటునపుడు -
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు (2)
హల్లెలూయ పాటలు పాడుచుండ -
ప్రియ యేసుతో నేను యుల్లసింతున్ (2)
3. ముండ్ల మకుటుంబైన తలనుచూచి
స్వర్ణ కిరీటంబెట్టి ఆనందింతునే
కొరడాతో కొట్టిన వీపున్ జూచి
ప్రతియొక్క గాయంబున్ చూచింతును
4. హృదయము స్తుతులతో నింపబడె -
నా భాగ్య గృహమును స్మరించు చుంటే (2)
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ -
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2)
5. ఆహా యాబూర ఎపుడు ధ్వనించునో
ఆహా నా ఆశ ఎపుడు తీరుతుందో (2)
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో -
ఆశతో వేచియుండే నా హృదయం (2)
0 Comments