187 Paradesi O Paradesi/ పరదేశీ! ఓ పరదేశీ! / Athmiya Geethalu

ప: పరదేశీ! ఓ పరదేశీ! 
ఎటుచూసినా ఎడారులే - ఎందుబోయిన ఎండమావులే

అ: ఏనాటికైనా ఈ కాయమూ మాయమగుటే ఖాయమూ 
ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము 
యేసు రక్తమే జయము - సిలువ రక్తమే జయము (4)

1. కట్టుకున్న వారే నీపై కుప్పలా కూలినా 
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా (2) 
అన్నదమ్ములే నీకై కలవరించినా - అలమటించినా 
బంధువులంతా బ్రతిమాలినా - ఆత్మీయులే అడ్డగించినా llఏనాటిll

2. ఫ్యాక్టరీలు ఉన్నా - మోటారు కారులెన్ని ఉన్నా 
పొలాలెన్ని ఉన్నా - ఇండ్ల స్థలాలెన్ని ఉన్నా (2) 
అందగాడివైనా ఆటగాడివైనా - ఎంతటి మాటకారివైనా 
సిపాయివైనా కసాయివైనా - బికారివైనా ఏకాకినైనా llఏనాటిll

3. తెల్లవాడివైనా - తెలిసిన నల్లవాడివైనా 
కాయకష్టమున్నా - ఎంతటి ప్రేమ తత్వమున్నా (2) 
విద్యావేత్త వైనా తత్వవేత్త వైనా - ఎంతటి శాస్త్రవేత్త వైనా 
ప్రీసువైనా జడ్జిస్టు వైనా - మార్క్సిస్టు వైనా కోపిష్టి వైనా llఏనాటిll

Post a Comment

0 Comments