నీలా క్షమియించేదెవరు - యేసయ్యా
నీలా పాప్తికై ప్రాణం పెట్టిన వారెవరు?
1. లోక బంగారము ధన ధాన్యాదులు
ఒక పోగేసిన నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వసంద్రములు
ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
నీలా పరిశుద్ధదేవుడెవరున్నారయా నీవేగా మంచిదేవుడవు llనీతోll
2. పలు వేదాలలో మత గ్రంథాలలో
పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాప పరిహారార్ధం సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా జాలిగల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు llనీతోll
3. నేను వెదకకున్నా నాకు దొరికితివి
నే ప్రేమించకున్నా నను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచు రేపితిని
నన్నెంతో సహించి - క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా
నీవేగా చాలినదేవుడవు llనీతోll
0 Comments