185 Neevu Chesina Upakaramulaku / నీవు చేసిన ఉపకారములకు / Athmiya Geethalu

ప: నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును 
ఏడాది కోడెలనా? వేలాది పొట్టేళ్ళనా? (2)  ||నీవు||

1. వేలాది నదులంత విస్తార తైలము - 
నీ కిచ్చినా చాలునా? 
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని - 
నీ కిచ్చినా చాలునా  ||నీవు||

2. మరణ పాత్రుడనైయున్న నాకై - 
మరణించితివా సిలువలో
కరుణజూపి నీ జీవమార్గాన - 
నడిపించుము యేసయ్యా  ||నీవు||
3. విరిగి నలిగిన బలియాగముగను 
నా హృదయమర్పింతును 
రక్షణపాత్రను చేబూని నిత్యము - 
నిను వెంబడించెదను ||నీవు||

Post a Comment

0 Comments