నీ దశమభాగము నీయ - వెనుదీతువా
1. ధరలోయందున ధనధాన్యముల నీయగా - కరుణించి
కాపాడి రక్షింపగా పరలోక నాథుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా llనీll
2. పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు
నీకు దయచేయగా - వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా llనీll
3.వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె
ప్రభు నీకు ఉచితంబుగా - వెలిగించ ధరపైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభునాకర్పించవా llనీll
4.కలిగించె సకలంబు సమృద్ధిగా - తొలగించ
పలు బాధ భరితంబులు బలియాయె - నీ పాపముల కేసుడు
చెలువంగ ప్రభుయ చింతింతువా llనీll
0 Comments