వర్ణించలేనుస్వామీ నీ గొప్పకార్యాలను
పల్లవి : మదిలోన నీరూపం నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
1. ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్ఫూర్తినీవై
నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం ఇలలోనీవే కదా! యేసయ్యా నీరూపం !! !! మదిలోన
2. నిరంతరం నీసన్నిధిలో నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిశగా నడిపెనే
నీనిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి
నీకొరకు సాక్షిగా! యేసయ్యా !! మదిలోన నీరూపం !!
3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశలసౌధం
ఇలలో నీవేనయ్యా ! యేసయ్యా !! మదిలోన నీరూపం !!
0 Comments