226 Bahu Soundhayra Seeyonulo / బహు సౌందర్య సీయోనులో / Hosanna Ministries Songs



పల్లవి : బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా 
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై 
నా హృదయాన కొలువాయెనే 
ననుజీవింపజేసే నీవాక్యమే 
నాకిలలోన సంతోషమే

1. పరిశుద్ధతలో మహనీయుడవు 
నీవంటిదేవుడు జగమునలేడు 
నాలో నిరీక్షణ నీలోసంరక్షణ 
నీకే నాహృదయార్పణ !! బహు సౌందర్య !!

2. ఓటమినీడలో క్షేమములేక 
వేదనకలిగిన వేళలయందు 
నీవు చూపించిన నీ వాత్సల్యమే 
నాహృదయాన నవజ్ఞాపిక !! బహు సౌందర్య !!

3. ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు 
చల్లని నీచూపే ఔషధమే 
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం 
నాలోనింపెను ఉల్లాసమే !! బహు సౌందర్య !!

Post a Comment

0 Comments