పల్లవి : ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
1. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా
2. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులొలికించెను నీ వాక్యపవాహము
గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు
వివరింప నా తరమా వర్ణింప నా తరమా
3. విధిరాసిన విషాదగీతం సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్ధానములతో నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో యుగయుగములు వే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా
0 Comments