పల్లవి : నూతన గీతము నే పాడెద మనోహరుడ యేసయ్య
నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను
సమర్పణతో సేవించెదను నిన్నే
సజీవుడనై ఆరాదించెద నిన్నే....||2||
1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముంది నాలో
స్వార్ధమెరుగాని సాత్వికుడా నీకు సాటేవ్వరు...||2||
నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను..||2|| ||నూతన||
2. కడలి తీరం కనపడని వేళ కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటేవ్వరు...||2||
నీవే నా ధైర్యము - నీ కృపయే ఆధారము..||2|| ||నూతన||
3.మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి
మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటేవ్వరు....||2||
నీవే నా విజయము - నీ మహిమయే నా గమ్యము ...|| 2|| ||నూతన||
0 Comments