పల్లవి : పాటలతోనే పయనం సాగాలి
సియోను పాటలు పాడుకుంటూ
హల్లెలూయ పాటలతో - హోసన్నా గీతాలతో
1. యోర్దాను ఎదురోచ్చినా –
ఎర్ర సంద్రం పొంగిపొరలిన
ఫరో సైన్యం తరుముకొచ్చినా
యేసయ్య సన్నిధి తోడుండాగా..
తోడుండగా...తోడుండాగా.. ||పాటలతోనే||
2. పగలు మేఘస్తంభమై -
రాత్రి అగ్ని స్థంభమై
ఆకాశము నుండి ఆహారమునిచ్చి..
ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి..
దాహము తీర్చితివి.. ||పాటలతోనే||
3. తంబురతో సీతారతో –
బూరధ్వనితో స్వరమండలముతో
నాట్యముతో పిల్లనగ్రోవితో..
ఆత్మలో ఆనందించుచూ..
ఆనందించుచూ.. ఆనందించుచూ.. ||పాటలతోనే||
0 Comments