పల్లవి : వినరండి నా ప్రియుని విశేషము
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు ||2||
వినరండి నా ప్రియుని విశేషము -
నా వరుడు సుందరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని –
ప్రేమకు రూపము చూసితిని ||2||
ఆహా ఎంతో! మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించే మహాధానందమే!
1. మహిమతో నిండిన వీధులలో –
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2||
జతగ చేరేదను ఆ సన్నిధిలో -
కురిసే చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియయేసు నను చూసి దరిచేరునే
జతగ చేరేదను ఆ సన్నిధిలో -
నా ప్రేమను ప్రియునికి తెలిపేదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
2.జగతికి రక్షాసము లేనపుడును -
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2||
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపనే జయధ్వనితో కీర్తయించెదను
నా ప్రభుయేసు చెంతన చేరేదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని -
నా ప్రభుయేసు చెంతన చేరేదను
యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో -
నిలిచే శుద్ధ హృదయాల వీరులతో ||2||
ఫలము ప్రతి ఫలము నే పొందుకొని -
ప్రియయేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతి ఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||
0 Comments