దేవా నా ఆర్థధ్వని

పల్లవి : దేవా నా ఆర్థధ్వని వినవా నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా

1. గాలివాన హోరులో - గమ్యమెటో కానరాక గురియైన నిను చేర - పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను - ఆనందమైనను నీవేగదా

2.అంతరంగ సమరములో- ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర - తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను - ఆశ్రయమైనను - ఆరాధనైనను నీవేగదా

Post a Comment

0 Comments