1.నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములోనుండి ననువేరు చేసినది నీదయా సంకల్పమే|| ప్రభువా ||
2.జీవపు వెలుగుగ నను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే || ప్రభువా ||
3.సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే పరిపూర్ణ శాంతితో నను కాచుటయే నీ నిత్యసంకల్పమే || ప్రభువా ||
0 Comments