క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
క్రీస్తే నాలో జీవించుచున్నడు
1.నేను నా సొత్తు కానేకాను
క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు
యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది
|| జీవించు ||
2.యుద్ధము నాది కానేకాదు
యుద్ధము యేసయ్యదే నా పక్షమున
జయమసలే నాది కానేకాదు
యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు
|| జీవించు ||
3.లోకము నాది కానేకాదు
యాత్రికుడను పరదేశిని
నాకు నివాసము లేనేలేదు యేసయ్య నివాసము నాకిచ్చినాడు
|| జీవించు ||
0 Comments