236. Srusti Karthavaina Yehova | సృష్టి కర్తవైన యెహోవా | Song Lyrics | Athmiya Geethalu

ప॥ సృష్టి కర్తవైన యెహోవా
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ 
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు 
నాలో నిన్ను చూశావు - నీలో నన్ను దాచావు 
నిస్వార్ధమైన నీ ప్రేమ - మరణము కంటె బలమైనది నీ ప్రేమ

1. ఏ కాంతి లేని నిశీధిలో - ఏ తోడు లేని విషాదపు వీధులలో 
ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్నతండ్రివి 
యేసయ్యా నను అనాధగ విడువక 
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి ॥సృష్టి॥

2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి - నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి 
యేసయ్యా నను కృపతో బలపరచి 
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి  ॥సృష్టి॥

Post a Comment

0 Comments