Kummarinchumu Nayana
కుమ్మరించుము నాయనా
నీ పరిశుద్ధ ఆత్మను
నా తనివి తీర నిన్నే సేవింతు
నా కన్న తండ్రివే నీవనుచు
అ.ప: నన్ను వెదికితివి
నీ చూపులో దాచితివి
నీ తను వెళ్ళ ముద్దాడేదనయ్య
నీ చూపులో దాచితివి
నీ తను వెళ్ళ ముద్దాడేదనయ్య
1.నిర్జీవమైన తుమ్మకర్రను
నీ అగ్ని చేత నన్ను తాకుము
మండుచు నేను ప్రకాశించుచు
నీ సాక్షిగ జీవింతును
నీ సాక్షిగ జీవింతును
ఈ అంత్య దినముల యందు
అనేకుల మీద నీవు
నీ ఆత్మను కుమ్మరించెదనంటివే ॥2॥ ॥కుమ్మ॥
2.సమూయేలు ప్రార్థించగా దావీదు పైన
నీ బలమైన ఆత్మ దిగివచ్చే
నీ బలమైన ఆత్మ దిగివచ్చే
శత్రువు రాజ్యంపై విజయం పొందెను
నీ నామమే ఘనపరుచబడెనూ
నా రక్తము కారునంతగా
నీ సేవలో సాగెదను
నీ సిలువ జెండా ఎగరవేసెదనయ్య ॥కుమ్మ॥
నా రక్తము కారునంతగా
నీ సేవలో సాగెదను
నీ సిలువ జెండా ఎగరవేసెదనయ్య ॥కుమ్మ॥
0 Comments