Enni Thalachina Edhi Adigina|ఎన్ని తలచిన ఏది అడిగినా
పల్లవి: ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగించు నీ చిత్తమే - ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా
1.నీ తోడు లేక - నీ ప్రేమలేక - యిలలోన ఏ ప్రాణి - నిలువలేదు
అడవిపువ్వులే నీ ప్రేమ పొందగా - నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ॥ఎన్ని॥
2.నా ఇంటిదీపం నీవేయని తలచి - నా హృదయం
నీ కొరకు పదిలపరిచితి
ఆరిపోయిన నా ఆత్మదీపము - వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ॥ఎన్ని॥
నీ కొరకు పదిలపరిచితి
ఆరిపోయిన నా ఆత్మదీపము - వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ॥ఎన్ని॥
3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా- నాకాపరి నీవై నన్నాదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా నీనుండి వేరుచేయవు-ప్రభువా ॥ఎన్ని॥
4.నా స్థితి గమనించినన్ను ప్రేమించి - నాకొరకై
కల్వరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష
మార్గము నీ యందెనిత్యజీవము ప్రభువా ॥ఎన్ని॥
కల్వరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష
మార్గము నీ యందెనిత్యజీవము ప్రభువా ॥ఎన్ని॥
0 Comments