32. Parama Jeevamu | పరమ జీవము | Song Lyrics | Athmiya Geethalu

ప॥ పరమ జీవము నాకు నివ్వ - తిరిగిలేచెను నాతో నుండ 
నిరంతరము నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును

అ.ప. యేసు చాలును - యేసు చాలును 
ఏ సమయమైన - ఏ స్థితికైన - నా జీవితములో - యేసు చాలును

1. సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను 
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను ॥ యేసు॥

2. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతిజలము చెంత నడిపించును 
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణములలో నన్నుకాపాడును ॥ యేసు॥

3. నరులెల్లరు నను విడచినను - శరీరము కుళ్ళి కృశించినను 
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను ॥ యేసు॥

Post a Comment

0 Comments