29. Siluva Chentha Cherinadu | సిలువ చెంత - చేరిననాడు | Song Lyrics | Athmiya Geethalu

{} సిలువ చెంత - చేరిననాడు - కలుషములను - కడిగివేయు 
{అ.ప} పౌలు వలెను - సీలవలెను సిద్ధపడిన భక్తుల జూచి

1. కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు 
పడియున్న పాపులనైన - పిలచుచుండె పరము చేర ॥సిలువ॥

2. వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పిఒంటరియాయె 
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ॥సిలువ॥

3. తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడిచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రి యతని జేర్చుకొనెను ॥సిలువ॥

4. పాపిరావా పాపము విడిచి - పరిశుద్దుల విందులోచేర
పాపులగతిని పరికించితివా - పాతాళంబే వారి యంతం ॥సిలువ॥

Post a Comment

0 Comments