యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించే
1. జనములు నీదువెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు.
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు॥లెమ్ము॥
2. సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును॥లెమ్ము॥
3. దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను ॥లెమ్ము॥
4. నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్
బహు తరములకు సంతోష - కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును॥లెమ్ము॥
0 Comments