జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవయుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ
1. దారుణ హింసలలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము ॥దేవుని॥
2. పరిశుద్ధాత్మునికై - ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదుము॥దేవుని॥
3. అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే - వీనుల విందుగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదుము॥దేవుని॥
4.సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం - నిజముగ రక్షణ ప్రభలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము ॥దేవుని॥
5. గోధుమ గింజవలె - క్రీస్తుడు చావగను
నాధుడు మరణములో - శాశ్వత జీవమును
నిధులుగ పండించి తేవగును-మాధుర్య రక్షణ లభియించె ॥దేవుని॥
6. హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ- గతకాలపు సేవ - గొల్గోత గిరి జేర
రీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ॥దేవుని॥
7. ప్రభువును చూచుటకై - ప్రజలందరు రాగా
విభుమహిమను గాంచ - విశ్వమే మముగోర
శుభములు గూర్చుచు మాలోనా-శోభిల్లు యేసునుజూపుదుము ॥దేవుని॥
0 Comments