26. Cheyi Pattuko Na Cheyi Pattuko | చేయి పట్టుకో నా చేయి పట్టుకో | Song Lyrics | Athmiya Geethalu

చేయి పట్టుకో నా చేయి పట్టుకో 
జారిపోకుండా నే పడిపోకుండా యేసువా చేయి పట్టుకో (2)

1. కుంగిన వేళ ఓదార్పు నీవేగా 
నన్ను ధైర్యపరచి నాతోడు నీవేగా (2) 
మరువగలనా నీ మధుర ప్రేమను 
యేసు నా జీవితాంతము, యేసు నాజీవితాంతము॥చేయి॥

2. లోక సముద్రము నాపైకి ఎగసిన 
విశ్వాస నావలో కలవరమే రేగిన 
నిలవ గలనా ఓ నిముషమైనను 
యేసు నా చేయి విడిచినా - యేసు నా చేయి విడిచినా ॥చేయి॥

Post a Comment

0 Comments