25. Idigo Deva Naa Jeevitham | ఇదిగో దేవా నా జీవితం | Song Lyrics | Athmiya Geethalu

ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం 
శరణం నీ చరణం శరణం - నీ చరణం

1. పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి 
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి (2) 
ఐనా నీ ప్రేమతో నన్నునీ దరి చేర్చినావు 
అందుకే గైకొనుము దేవా - ఈ నా శేష జీవితం

2. నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నే నెరుగ నేర్పు 
నీ హృదయ భారంబు నొసఁగి - ప్రార్ధించి పని చేయనిమ్ము 
ఆగిపోక సాగిపోవు - ప్రియ సుతునిగ పని జేయనిమ్ము 
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము

3. విస్తర పంట పొలము నుండి - కష్టించి పని చేయనిమ్ము 
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు 
క్షేమ క్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకనిమ్ము 
నశించు ఆత్మలను నీదరి చేర్చ కృపనుయిమ్మయ

Post a Comment

1 Comments