యేసుతో నడిచెద యేసుతో గడిపెద
పరమును చేరగ నేవెళ్ళేద - హానోకు వలె సాగెదా.....
1. లోకపు శ్రమలు నన్నెదిరించిన
కఠినులు రాళ్ళతో హింసించిన - సైఫను వలె సాగెదా.... ॥నే॥
2. వెనుక శత్రువులు వెంటాడినను
ముందు సముద్రము ఎదురొచ్చినా - మోషేవలె సాగెదా ॥నే॥
3. తల్లియు మరచిన తండ్రియు విడచిన
బంధువులే నన్ను వెలివేసినా - బలవంతునితో సాగెదా ॥నే॥
4. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన - పౌలు వలె సాగెదా ॥నే॥
0 Comments