సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా
1. యెర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే! ॥ కృపా॥
2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా
నా ఎడారి (కష్ట) జీవితమే - సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య (కన్నీటి) రోదన ఉల్లాసముగా మారిపోయెనే!! ॥ కృపా॥
3. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా
ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగా మారిపోయెనే! ॥ కృపా॥
0 Comments