34. Nee Vakyame Nannu Brathikinchenu | నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Song Lyrics | Athmiya Geethalu

ప॥ నీ వాక్యమే నన్ను బ్రతికించెను 
బాధలలో నెమ్మది నిచ్చెను 
కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా 
వాక్యమైయున్న యేసు వందనమయ్యా

1. జిగట గల ఊబినుండి లేవనెత్తెను 
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను 
నా పాదములకు దీపమాయెను  
సత్యమైన మార్గములో నడుపుచుండెను ॥నీ వాక్యమే॥

2. శత్రువును ఎదుర్కొనే సర్వాంగకవచమై 
యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది 
అపవాది వేయుచున్న అగ్ని బాణములను 
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ॥నీ వాక్యమే॥

Post a Comment

0 Comments