మహా ఆశ్చర్యమేమహిమానందమే - మహా ఆశ్చర్యమే (2)
1. సర్వ శరీరులు గడ్డినిపోలిన - వారై యున్నారు (2)
వారి అందమంతయు - పువ్వువలె
వాడి పోవును - వాడి పోవును॥మాధుర్యమే॥
2. నెమ్మదిలేకుండా విస్తారమైన - ధనముండుటకంటె (2)
యెహోవాయందలి భయభక్తులతో
ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥మాధుర్యమే॥
3 . నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే (2)
నా పాపమంతయు సిలువలో -పరిహరించెను-పరిహరించెను ॥మాధుర్యమే॥
4. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను (2)
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎప్పుడు చేరెదనో - ఎప్పుడు చేరెదనో ॥మాధ్యుర్యమే॥
0 Comments