36. Chalunaya Chalunaya | చాలునయ్యా చాలునయ్యా | Song Lyrics | Athmiya Geethalu



ప॥ చాలునయ్యా చాలునయ్యా - నీ కృప నాకు చాలునయ్యా (2) 
ప్రేమామయుడిపై ప్రేమించావు
కరుణామయుడిపై కరుణించావు (2) 
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించె (2) 
ప్రేమ కరుణ నీ కృప చాలు (2) ॥ చాలు॥

1. జిగటగల ఊబిలో పడియుండగా 
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) 
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా 
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా 
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియ్యా 
నా జీవితమంత అర్పింతు నీకయ్యా 
ప్రేమ కరుణ నీ కృప చాలు (2)॥ చాలు॥

2. బంధువులు స్నేహితులు త్రోసేసినా 
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) 
నన్ను నీవు విడువనె లేదయ్యా 
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా 
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియ్యా 
నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా 
ప్రేమ కరుణ నీ కృప చాలు (2) ॥ చాలు ॥

Post a Comment

0 Comments