భాసిల్లెను సిలువలో పాపక్షమ - యేసుప్రభో నీ దివ్యక్షమ
1. కలువరిలో నా పాపముపొంచి - సిలువకు నిన్ను యాహుతిజేసి కలుష హరా కరుణించితివి ||భాసి||
2. దోషము చేసినది నేనే కదా - మోసములో బ్రతికిన నేనేకదా మోసితివా నా శాపభారం ||భాసి||
3. పాపము చేసి గడించితి మరణం - శాపమేగా నే నార్జించినది కాపరివైనను బ్రోచితివి ||భాసి||
4. ఎందుకో నాపై యీ ప్రేమ - అంత దయాస్వామీ నా మదికి అందులకే భయమొందితిని ||భాసి||
5. నీ మరణపు వేదన వృధాకాదు - నా మది నీ వేదనలో మునిగె క్షేమము కలిగెను హృదయములో ||భాసి||
6. నమ్మినవారిని కాదనవనియు - నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదమ్ములను ||భాసి||
0 Comments