37. Yehova Nee Namamu | యెహోవా నీ నామము | Song Lyrics | Athmiya Geethalu

ప॥ యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది - ఎంతో బలమైనది.

1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్థించగా - సూర్యచంద్రుల నాపితివి (2) ॥యెహోవా॥

2. నీ ప్రజల పక్షంబుగా - యుద్ధములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) ॥యెహోవా॥

3. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా 
సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను (2) ॥యెహోవా॥

4. సింహాల బోనైననూ - సంతోషముగా వెళ్ళిరి 
ప్రార్థించినా వెంటనే రక్షించే నీ హస్తము (2) ॥యెహోవా॥

5. పౌలు సీలను బంధించీ - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్థించగా చెరసాల బదలాయె (2) ॥యెహోవా॥

6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని 
లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము (2) ॥యెహోవా॥

Post a Comment

0 Comments