జరిగేది నీ చిత్తమే ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా ||2||॥ ఎన్ని॥
1. నీ తోడులేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగ
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా ॥2॥ ॥ ఎన్ని॥
2. నా యింటి దీపం నీవేయని తలచి
నా హృదయం నీకొరకు పదిలపరచితి
ఆరిపోయిన నా ఆత్మ దీపము
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ॥2॥ ॥ ఎన్ని॥
3. ఆపదలు నన్ను వెన్నంటి యున్న
నా కాపరి నీవై నన్నాదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు ప్రభువా॥2॥ ॥ఎన్ని॥
0 Comments