యేసే ఆ దైవం చూడన్నా - చూడన్నా - యేసే ఆ దైవం చూడన్నా
1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్రజీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు - ఆదిదేవుడు - ఆదరించెను - ఆదుకొనును ||ఓరన్నా||
2. పరమును విడచి వచ్చాడన్నా- నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను ||ఓరన్నా||
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా - మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభు మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును ||ఓరన్నా||
4. మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడెగా - మరణపు పాపం తొలగించెను ||ఓరన్నా||
0 Comments