అడ్డుగా - వచ్చువైరిగెల్వను
యుద్ధనాదంబుతో - బోదము
1. రారాజు - సైన్యమందు జేరను
ఆరాజు - దివ్య సేవజేయను
యేసురాజు ముందుగా ధ్వజము బట్టినడువగా
యేసుతో ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
2. విశ్వాస - కవచమును ధరించుచు
ఆరాజు ఆజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై
యేసుతో - ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
3. శోధనలు - మనల చుట్టి వచ్చినా
సాతాను - అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక - ప్రభువు చెంతనుండగా
యేసుతో - ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
4. ఓ యువతి యువకులారా జేరుడి
శ్రీయేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై యేసునాధు గొల్వను
సాధనం బెవరు - నీవునేనెగా ॥యేసుతో॥
0 Comments