1.శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి.
పరముడ నిను ప్రణుతింతు ప్రియముగ పరలోక ప్రార్ధన నేర్పుమయా॥ప్రా॥
2. పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగా మోడ్చి
శిరమును వంచి - సరిగనువేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా ॥ప్రా॥
3.దినములోన చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యా - ఒంటిగకొండపై - చేసిన ప్రార్ధన నేర్పుమయా॥ప్రా||
4.శ్రమలు యేసువా చుట్టుకొని - శత్రుమూక నిను చుట్టగనూ
శాంతముతో శరణని వేడిన - గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా ॥ప్రా॥
0 Comments