నాగురి నీవే నా ప్రభువా - నీదరి నే చేరెదను నేను
1. లోకమంతా నాదని యెంచి - బంధుమిత్రులే ప్రియులను కొంటి
అంతయు మోసమేగా - వ్యర్ధము సర్వము ఇలలో ఇలలో॥పర॥
2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీ లోకములో
పాపమునిండె జగములో - శాపము చేకూర్చుకొనే నేను॥పర॥
3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో
తెలుపుము ఎంతల్పుడనో - విరిగి నలిగి యున్నాను నేను ॥పర॥
4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా - మహిమానందము కలిగె - నాలో ॥పర॥
5.యాత్రికుడ నే నీ లోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా - పొందితి నేను యేసుని - నేను ॥పర॥
6.నా నేత్రములు మూయబడగన్- నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్ పరలోకదేశము - నాదు గానము నిదియే నిత్యము ॥పర॥
0 Comments