ప॥ ఎంత మంచి దేవుడవయ్యా - యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరినా
నా చింతలన్ని తీరేనయ్యా - నిన్ను చేరినా ॥2॥
1. సంతోషం ఎక్కడ వుందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేనని
జగమంత వెదికాను జనులందరి నడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను. ॥ఎంత॥
2. ప్రేమనేది ఎచ్చట వుందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేదని
బంధువులలో వెదికాను - స్నేహితులను అడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను ॥ఎంత॥
3. సత్యమనేది ఎక్కడ వుందని
నిత్యజీవమనేది ఎచ్చట నాకు దొరికేనని
ఎందరికో మ్రొక్కాను - ఏమేమో చేశాను
చివరికది నీలోనే కనుగొన్నాను॥ఎంత॥
0 Comments