నా కన్నీరు తుడుచుటకు నన్నాదరించుటకు
నా యేసువా మేఘములపైనా వేవేగరారమ్ము
1.మధ్యాకాశములో పరిశుద్ధ దూతలతో వచ్చేవేళ
నా కొరకు గాయపడినా ఆమోమున్ ముద్దాడుటకు
నీటి కొరకై వేచిన గూడబాతులా వేచి యుందున్
2.దవళ వస్త్రం ధరియించినా పరిశుద్ధుల సమయమిది.
నీ దరికి చేరినేను హల్లెలూయ పాడుటకు
బుద్ధిగల కన్యకను పోలి వేచియుందున్
3.సూర్యచంద్ర తారలనే దాటి పరదైసులో
ఆస్పటిక నది తీరానా - జీవవృక్ష నీడలో
నిత్యమైనా నివాసం చేరుటకు వేచియుందున్
0 Comments