ఎల్లప్పుడు - దేవుని స్తుతించెదము
ఆ హల్లెలూయా.. హల్లెలూయ... హల్లెలూయ
1.అల సైన్యములకు - అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన ప్రభువగు
యెహోవాను - స్తుతించెదము ||హల్లె||
2.ఆకాశమునుండి - మన్నాను పంపిన దేవుని - స్తుతించెదము
బండనుండి మధుర - జలమును పంపిన
ఆ యెహోవాను - స్తుతించెదము ||హల్లె||
3.పరలోకము నుండి - ధరకేతెంచిన - దేవుని స్తుతించెదము
నశించిన దానిని - వెదకి రక్షించిన
యేసుని - స్తుతించెదము ||హల్లె||
0 Comments