Randi Randi Yesuni Yodhaku|రండీ రండీ యేసుని యొద్దకు|Song Lyrics

ప॥ రండీ రండీ యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.

అ॥ ప్రయాసపడి భారము మోయువారలు ||2||
ప్రభుని చెంతకు పరుగిడి వేగమై ||2||

1. యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన - దొరకదు శాంతి ఆత్మకునిలలో ॥రండీ॥ 

2. కరువు రణము మరణము చూచి - మనస్సు మార్చరేలా
యూదులు పాలస్తీనుచేరుటలో - ప్రవచనములు సంపూర్ణములాయెను ॥రండీ॥

3. ప్రభుయేసు నీకొరకై తనదు - ప్రాణము నిచ్చెకదా
సిలువలొ రక్తము చిందించియును - బలియాయెను యాఘనుడు మనకై ॥రండీ॥

4. యేసుని నామము నందే పరమ - నివాసము దొరకును
ముక్తిని పాపవిమోచనమును - శక్తిమంతుడు యేసేయిచ్చును ॥రండీ॥

5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును 
నేనే గాకింకెవ్వరు లేరని - ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ॥రండీ॥

6. హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయామెన్
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ ॥రండీ॥

Post a Comment

0 Comments