దేవా రావయ్యా నీ దీవెన లీవయ్యా ॥2॥
1. ఏదేను వనమున యెహోవ దేవ, మొదటి వివాహము చేసితివే ॥ 2 ॥
ఈశుభ దినమున నవ దంపతులను ॥2॥
నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా||
2. నా విందులో అక్కడ నెరిగీ - నీళ్ళను రసముగా మార్చితివే ॥2॥
కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా ॥2॥ ||దేవా||
3. బుద్దియు, జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే ॥2॥
ఇహపర సుఖములు మెండుగ నొసగి
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా - దేవా రావయ్యా నీ దీవెన లీవయ్యా ||దేవా||
0 Comments