SadgunaSheeluda Neeve Pujyudavayya|సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు|Song Lyrics

సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు 
స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు 
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి 
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి 

యేసయ్యా నీ సంకల్పమే 
ఇది నాపై నీకున్న అనురాగమే ||2||

1. సిలువ సునాదమును నా శ్రమ దినమున 
మధురగీతికగ మదిలో వినిపించి 
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి 
కాంతిమయముగ కనపరచితివే నీ ఆత్మశక్తితో ||సద్గుణ||

2. నా తోడు నీడవై మరపురాని 
మహోపకార్యములు నాకై చేసి 
చీకటి దాచిన - వేకువగా మార్చి 
బలమైన జనముగ నిర్ధారించితివి నీ కీర్తి కొరకే ||సద్గుణ||

3. నా మంచి కాపరివై మమతా సమతలు 
మనోహర స్థలములలో నాకనుగ్రహించి 
మారా దాచిన మధురము నాకిచ్చి 
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై ||సద్గుణ||

Post a Comment

0 Comments