ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం యేసయ్యా
1. అణువణువు నా ప్రాణమంతా వేచి యున్నది నీకై నిరతము (2)
నీవే నాదు సర్వము ప్రభువా (2) ॥నా॥
2. నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే (2)
నీకై నేను ముందుకు సాగెద (2) ॥నా॥
3. నలిగి పోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయ్యా (2)
రక్షణ ఆనందం నింపుము దేవా (2) ॥నా॥
0 Comments