Ascharyakaruda Na Alochana Karthavu|ఆశ్చర్యకరుడా - నా ఆలోచన కర్తవు|Song Lyrics

ప॥ ఆశ్చర్యకరుడా - నా ఆలోచన కర్తవు 
నిత్యుడగు తండ్రిని - నా షాలేము రాజువు

1. సింహపు పిల్లలైనా - కొదువ గలిగి ఆకలిగొనినా 
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీ వున్నంతవరకు ॥ ఆశ్చర్య॥

2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్ఠులే కదా నీ వున్నంత వరకు ॥ ఆశ్చర్య॥

3. చీకటి తొలగె - నీతి సూర్యుడు నాలో ఉదయించె 
నీ సాక్షిగా-వెలుగమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు ॥ ఆశ్చర్య॥

Post a Comment

0 Comments