నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది
1. తల్లిదండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును
ఎన్నడెన్నడు మారనిది - నాయేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది. - నా ఏసుని నిత్యప్రేమ ||ప్రేమా||
2. భార్యభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్న||
3. బంధు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమదీపము
నూనె ఉన్నంతకాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్న||
4. ధరలోని ప్రేమలన్నియు స్థిరముకాక తరిగిపోవును
క్రీస్తుయేసు కల్వరి ప్రేమ - కడవరకు ఆదరించును ||ఎన్న||
0 Comments