కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా?
1. మనస్సులో నెమ్మది కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి - విజయానందముతో నింపినావు నీరుపారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు ॥నీ కార్య॥
2. విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్నిశోధనలు జయించుటకు - మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్థంబముపై నను నిలిపినావు
॥నీ కార్య॥
3. పవిత్రురాలైన కన్యకగా - పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి - పరమానందముతో నింపినావు . సిద్ధ పడుతున్న వధువుగా - సుగుణాల సన్నిధిలో ననునిలిపినావు
॥నీ కార్య॥
0 Comments