Nee Chethitho Nannu Pattuko|నీచేతితో నన్ను పట్టుకో|Song Lyrics

ప॥ నీచేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము

1. అంధకార లోయలోన - సంచరించినా భయము లేదు 
నీ వాక్యము శక్తి గలది - నా త్రోవకు నిత్య వెలుగు ॥నీచేతితో॥

2. ఘోర పాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడి యుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  ॥నీచేతితో॥

3. ఈ భువిలో రాజు నీవే - నాదు హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము నీ సేవచేసెదన్ ॥నీచేతితో॥

Post a Comment

0 Comments