ఇది లోక కళ్యాణం - మేరి పుణ్యదినం
1. రాజులనేలే రారాజు వెలిసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయములేదుమనకిలలో జయము జయము జయమహో ॥ఇది॥
2. గొల్లలు, జ్ఞానులు ఆనాడు - ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు, పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో
జయ నినాదమే భువిలో - ప్రతి ధ్వనించెను ఆ దీవిలో ॥ఇది॥
0 Comments