నిత్య జీవార్ధమైనవి నీ శాసనములు
వృద్ధి చేసితిఇవి పరిశుద్ధ జనమున నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో
1.ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు ॥నీతి॥
2. పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు
ప్రగతి పధములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ॥నీతి॥
3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు
మహిమగలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు ॥నీతి॥
0 Comments